This Day in History: 2015-10-19
కళ్ళు చిదంబరం 🔴
(కొల్లూరి చిదంబర రావు)
మరణం.
భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, ఇంజనీర్.
‘సకల కళాకారుల సమాఖ్య’ స్థాపకుడు. నంది అవార్డు గ్రహీత. మద్రాస్ కళాసాగర్ అవార్డు గ్రహీత.
విశాఖపట్నంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్.
పన్నెండు సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా నాటకాలు నిర్వహిస్తూండటంతో ఒక నరం పక్కకు వెళ్లి, మెల్ల కన్ను ఏర్పడింది.
ఆ లోపమే ఆయన్ని సినీ రంగానికి పరిచయమయ్యేలా చేసింది.
‘కళ్లు’ చిత్రంలో నటించిన కొల్లూరి చిదంబరరావు ‘కళ్లు చిదంబరం’ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.