1976-05-21 – On This Day  

This Day in History: 1976-05-21

1976 : మిసెస్ వరల్డ్ అదితి గోవిత్రికర్ జననం. భారతీయ సినీ నటి, వైద్యురాలు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిసెస్ వరల్డ్ 2001 టైటిల్ విజేత. ఈ ఘనత పొందిన గెలుచుకున్న మొదటి భారతీయురాలు. వైద్య మరియు మనస్తత్వవేత్త అర్హతను కలిగి ఉన్న ఏకైక భారతీయ సూపర్ మోడల్‌. ఆమెను హిందుస్థాన్ టైమ్స్ “బ్యూటీ విత్ బ్రెయిన్స్”గా అభివర్ణించింది. ఆమె శాఖాహారం మరియు విపస్సనా అభ్యాసకురాలు. ఆమె ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 1 మరియు బిగ్ బాస్ 3 లలో పోటీదారు. గోవిత్రికర్ 1996లో గ్లాడ్రాగ్స్ మెగామోడల్ పోటీని మరియు 2000లో గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా, తదనంతరం మిసెస్ వరల్డ్ గెలుచుకుంది. భారతదేశంలో కోకా-కోలా, చోపార్డ్, ఫెండి, హ్యారీ విన్‌స్టన్ వంటి అగ్రశ్రేణి అంతర్జాతీయ బ్రాండ్‌లను ఆమోదించింది.

Share