This Day in History: 1898-06-22
1898 : గాన కళాప్రపూర్ణ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై జననం. భారతీయ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, అధ్యాపకుడు.సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. నిర్వహించిన పదవులు
- శాఖాధిపతి, సంగీత విభాగం, అన్నామలై విశ్వవిద్యాలయం, చిదంబరం (1947-55).
- ప్రొఫెసర్, కేంద్ర సంగీత కళాశాల, మద్రాసు. (1956-60)
- వ్యవస్థాపక ప్రధానోపాధ్యాయులు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి. (1961-66)
- ప్రధానోపాధ్యాయులు, రాజాగారి సంగీత కళాశాల, తిరువయ్యారు. (1967)
- ప్రధానోపాధ్యాయులు, రామనాథన్ సంగీత అకాడమి, జఫ్నా, శ్రీలంక. (1967-71)
పురస్కారాలు
- సంగీత కళానిధి, 1954, మద్రాసు సంగీత అకాడమి, మద్రాసు
- సంగీత నాటక అకాడమి పురస్కారం, 1964, సంగీత నాటక అకాడమీ.
- గాన కళాప్రపూర్ణ, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి
- స్వర చక్రవర్తి.
- సంగీత సార్వభౌమ
- లయ బ్రహ్మ
- ఇసై పేరరింజర్, తమిళ ఇసై సంఘం, మద్రాసు.
- సంగీత విద్వన్మణి, త్యాగరాయ ఉత్సవ సమితి, తిరుపతి.
- ఇసైమన్నార్, శైవ సిద్ధాంత సభ, తిరునల్వేలి