This Day in History: 1887-12-22
1887 : శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకడు. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు. ఇంగ్లండ్ లోని రాయల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికైన రెండవ భారతీయుడు. 3900 గణిత సిద్ధాంతలతో 3 పుస్తకాలు రాశాడు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు వాటిమీద ఆధారపడి పనిచేస్తున్నారు. ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన పేరు మీద రామానుజన్ ప్రైమ్ అనే ప్రధాన సంఖ్య ఉంది.