This Day in History: 1856-07-23
1856 : లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ (కేశవ్ గంగాధర్ తిలక్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, జాతీయవాది, జర్నలిస్ట్, ఉపాధ్యాయుడు, స్త్రీ ద్వేషి, రచయిత, రాజకీయవేత్త. కులమతాలను ఎక్కువగా విశ్వాసించాడు. స్త్రీల, బ్రహ్మణేతరుల విద్యను వ్యతిరేకించాడు. అంటరానితన నిర్మూలనను అడ్డుకున్నాడు. అగ్రవర్ణ స్త్రీలు తక్కువ కులం వారిని వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించాడు. 11ఏళ్ల ఫూలామణి బాయి తన భర్తతో లైంగిక సంబందం వల్ల చనిపోయినడు పార్సీ సంఘ సంస్కర్త బెహ్రామ్‌జీ మలబారి అమ్మాయిల వివాహ అర్హత పెంచాలని మద్దతు ఇచ్చాడు, కానీ తిలక్ వ్యతిరేకించాడు. బాల వధువు రుఖ్మాబాయికి పదకొండేళ్ల వయసులో వివాహమైనా భర్తతో కలిసి జీవించేందుకు నిరాకరించగా కలసి జీవించాలి లేదా 6 నెలలు జైలు శిక్ష అన్న కోర్టు నిర్ణయాన్ని తిలక్ ఆమోదించాడు. లాల్ బాల్ పాల్ త్రయం యొక్క మూడవ వంతు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మొదటి నాయకుడు. బ్రిటిష్ వలస అధికారులు అతన్ని “భారత అశాంతికి తండ్రి” అని పిలిచారు. మహాత్మా గాంధీ ఆయన్ని “ఆధునిక భారతదేశపు సృష్టికర్త” అని పిలిచాడు. లోకమాన్య బిరుదు పొందాడు. ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ సహ వ్యవస్థాపకుడు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు. మరాఠా దర్పణ్, కేసరి అనే దినపత్రికలను స్థాపించాడు.