This Day in History: 1975-07-23
1975 : కళైమామణి సూర్య (శరవణన్ శివకుమార్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, పరోపకారి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆరుసార్లు చేర్చబడ్డాడు. అగరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ట్యాంకర్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్. పెప్సీ బ్రాండ్ అంబాసిడర్. ఎయిడ్స్ అవగాహనపై ఒక షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడు. నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. తమిళం, హిందీ, తెలుగు భాషలలొ పనిచేశాడు. అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కళైమామణి, చెన్నై టైమ్స్ ఫిల్మ్, సినీ మా, సినిమా ఎక్స్ప్రెస్, ఎడిసన్, ఫిల్మ్ ఫేర్ సౌత్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.