This Day in History: 2004-12-23
2004 : భారతరత్న పి వి నరసింహారావు (పాములపర్తి వెంకట నరసింహారావు) మరణం. భారతీయ రాజకీయవేత్త, బహుభాషావేత్త, రచయిత. భారతదేశ 9వ ప్రధానమంత్రి. ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి.
ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొట్టమొదటి తెలుగువాడు. మొదటి దాక్షిణభారతీయుడు కూడా. రక్షణ, విదేశాంగ, హోంశాఖా మంత్రి గా పనిచేశాడు. ఆయనను ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసాడు. అవినీతి ఆరోపణ కేసులలో నిర్దోషిగా నిరూపించుకున్నాడు.