This Day in History: 1948-02-24
1948 : తలైవి జయలలిత జయరామన్ జననం. భారతీయ సినీ నటి, నర్తకి, రచయిత, గాయని, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 5వ ముఖ్యమంత్రి. పురట్చి తలైవి, అమ్మ బిరుదులు పొందింది. 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు కు (రెండవ మహిళా) ముఖ్యమంత్రి. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన కార్యదర్శి. తమిళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో పనిచేసింది. అధిక ఆస్తుల కేసులో అరెస్టు అయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది. కలైలామణి పురస్కారంతో పాటు అనేక గౌరవ డాక్టరేట్లు, పురస్కారాలు అందుకుంది.