This Day in History: 2011-04-24
2011 : పుట్టపర్తి సత్యసాయి బాబా (రత్నాకరం సత్యనారాయణ రాజు) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వేదాంతి, పరోపకారి. 14 సంవత్సరాల వయసులో షిరిడీ సాయిబాబా పునర్జన్మ అని చెప్పుకున్నాడు.
నోట్లోంచి లోహాలు తీయడంపై ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. ముంబై లో “సత్యం”, హైదరాబాదు లో “శివం”, చెన్నై లో “సుందరం” అనే మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మీద 166 దేశాలలో 10,000 పైగా సత్యసాయి సేవా సంస్థలున్నాయి. ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ఆడిటోరియంలు, ఆశ్రమాలు, పాఠశాలలు లాంటి నెట్‌వర్క్‌ను స్థాపించాడు.
