1940-06-24 – On This Day  

This Day in History: 1940-06-24

Maganti Murali Mohan Maganti rajababu maganti muralimohan1940 : మురళి మోహన్ (మాగంటి రాజబాబు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ‘జయభేరి గ్రూప్’ వ్యవస్థాపకుడు.

లోక్ సభసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడు మాగంటి మాధవరావు కుమారుడు. జగమేమాయ తెలుగు చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది. జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహవ్యవస్థాపకుడు. నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా వ్యవహరించాడు. నంది, సైమ అవార్డులను అందుకున్నాడు.

Share