This Day in History: 1622-11-24
1622 : లచిత్ బోర్ఫుకాన్ (లచిత్ డెకా) జననం. అహోమ్ రాజు చక్రధ్వజ సింఘా సర్వ సైన్యాధికారిగా లచిత్ బోర్ఫుకాన్‌ను నియమించిన వెంటనే, ఆక్రమణలో ఉన్న గౌహతిని తిరిగి పొందటానికి లచిత్ మొఘలులతో యుద్దం చేసి వారిని వెళ్ళగొట్టాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఓటమి తట్టుకోలేక అంబేర్ రాజా ‘రామ్ సింగ్ కచ్వాహా’ ఆధ్వర్యంలో బలమైన మొఘల్ సైన్య బృందాన్ని లచిత్ సైన్యాన్ని ఓడించడానికి పంపాడు. కానీ సారైఘాట్ యుద్ధంలో మొఘల్ సైన్యం ఘోర పరాజయం పాలైంది. గౌహతి రాజభవనంపై అహోం జెండాను తిరిగి స్థాపించిన ఘనత లచిత్ దే. అస్సాంలో ఈరోజును లచిత్ దినోత్సవం గా జరుపుకుంటారు.