1894-02-25 – On This Day  

This Day in History: 1894-02-25

1894 : అవతార్ మెహెర్ బాబా (మెర్వాన్ షెరియార్ ఇరానీ) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, సామాజిక కార్యకర్త.

భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు. జొరాష్ట్రియన్ మతానికి చెందిన ఆయన 19 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభించాడు. 5 మంది ఆధ్యాత్మిక గురువులని కలిశాడు. తరువాత ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు. జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు.

Share