This Day in History: 1932-06-25
1932 : భారత జాతీయ క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో ఆడింది. టెస్ట్ క్రికెట్ హోదా పొందిన ఆరవ జట్టుగా అవతరించింది.
భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25 న ఇంగ్లాండుతో లార్డ్స్ లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించింది. ప్రారంభం నుంచి విదేశాలలో కన్నా స్వదేశంలోనే మంచి ఫలితాలను రాబట్టుకుంటోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్లపై బలహీనమైన ప్రదర్శన కావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన తొలి 50 సంవత్సరాలలో మొత్తం 196 టెస్టులు ఆడి కేవలం 35 విజయాలను మాత్రమే నమోదుచేయగలిగింది.
50 సంవత్సరాల అనంతరం సునీల్ గవాస్కర్ రూపంలో ప్రముఖ బ్యాట్స్‌మెన్, కపిల్ దేవ్ రూపంలో ప్రముఖ బౌలర్‌లు భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ, ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే క్రికెట్) లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది.