This Day in History: 1981-06-25
1981 : పూజ ఉమాశంకర్ (పూజ గౌతమి ఉమాశంకర్) జననం. భారతీయ శ్రీలంకన్ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.
తమిళం, సింహళం, మలయాళం, తెలుగు, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. తండ్రి భారతీయుడే అయినప్పటికీ తల్లి శ్రీలంక కు చెందినది, ఈమె సౌత్ ఇండియా సినిమాలతో మంచి క్యారెక్టర్స్ చేయడంతో పాటు శ్రీలంకలోని సింహళ సినిమా ప్రముఖ నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. తమిళనాడు స్టేట్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, విజయ్, డేరాన ఫిల్మ్, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్, ఆనంద వికటన్ సినిమా అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకుంది.