1991-06-25 – On This Day  

This Day in History: 1991-06-25

1991 : వింబుల్డన్‌లో మార్టినా నవ్రతిలోవా 100 వ సింగిల్స్ మ్యాచ్ విజయాన్ని సాధించి రికార్డు సృష్టించిన రోజు.

1956అక్టోబర్ 18న ప్రేగ్లో జన్మించిన మార్టినా నవ్రతిలోవా (Martina Navratilova) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్ రచయిత స్టీవ్ ఫ్లింక్ తన గ్రంథం The Greatest Tennis Matches of the Twentieth Century లో నవ్రతిలోవాను స్టెఫీగ్రాఫ్ తరువాత మహిళా టెనిస్ క్రీడాకారిణులలో 20 వ శతాబ్దపు రెండో ఉత్తమ క్రీడాకారిణిగా పేర్కొన్నాడు. మార్టినా నవ్రతిలోవా తన క్రీడా జీవితంలో 18 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 31 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను, 10 గ్రాండ్‌స్లాం మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్ళను గెలిచింది. వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో 12 సార్లు ప్రవేశించింది. 1982 నుంచి 1990 వరకు వరుసగా 9 సార్లు వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించడం విశేషం. మొత్తంపై 9 సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిళ్ళను గెలుపొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో 31 డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను గెలవడమే కాకుండా బిల్లీ జీన్ కింగ్‌తో కలిసి 20 సార్లు వింబుల్డన్ గెలుపొంది రికార్డు సాధించింది. వరుసగా 11 సార్లు గ్రాండ్‌స్లాం టోర్నమెంట్ ఫైనల్లో ప్రవేశించి 13 సార్లు ఈ ఘనత వహించిన స్టెఫీగ్రాఫ్ తరువాత రెండో స్థానంలో ఉంది.

Share