1935-07-25 – On This Day  

This Day in History: 1935-07-25

Kaikala Satyanarayanaనవరస నటనా సార్వభౌమ
కైకాల సత్యనారాయణ జననం.
భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త.
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. ఎన్టిఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు గ్రహీత. నట శేఖర, కళాప్రపూర్ణ, నవరస నటనా సార్వభౌమ బిరుదులు పొందాడు. లోక్‌సభ సభ్యుడు. ‘రామా ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జులై 25న జన్మించాడు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, ది గుడివాడ కళాశాల (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రుడయ్యాడు.

1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 87 ఏళ్ల కైకాల సత్యనారాయణ 2022 డిసెంబరు 23న హైదరాబాదులోని తన నివాసంలో కన్నుమూశారు.

Share