This Day in History: 1937-05-26
1937 : పద్మశ్రీ మనోరమ (గోపీశాంత) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమెను ఆచి అని కూడా పిలుస్తారు. ఆమె ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. నేషనల్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, కలైమామణి అవార్డులను అందుకుంది.
