This Day in History: 1981-12-26
1981 : కళైమామణి సావిత్రి (నిస్శంకర సరసవాణిదేవి) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, గాయని, నృత్యకారిణి, పరోపకారి. మహానటి, నడిగర్ తిలగం బిరుదులు పొందింది.
తమిళ నటుడు జెమిని గణేశన్ కు 3వ భార్య. ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది. చివరిదశలో పేద జీవితాన్ని గడిపింది. తెలుగు, తమిళ భాషలలొ పనిచేసింది. కలైమామణి పురస్కారంతో పాటు రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డులను అందుకొంది. ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదలైంది.