This Day in History: 1838-06-27
1838 : బంకిం చంద్ర ఛటర్జీ (బంకిం చంద్ర చటోపాధ్యాయ) జననం. భారతీయ నవలా రచయిత, కవి, జర్నలిస్ట్. ‘బంగాదర్శన్’ సాహిత్య పత్రిక వ్యవస్థాపకుడు. భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించాడు.
‘ఛటోపాధ్యాయ్’ పదాన్ని బ్రిటిష్ వారు పలకలేక ‘ఛటర్జీ’ అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచం కూడా ‘ఛటర్జీ’ అని పిలవడం ప్రారంభించింది. ఆయన బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు. అయాన రచన వందేమాతరం ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆయన వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను విశ్వకవి గా కీర్తించిన మొదటి వ్యక్తి బంకిం. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన మొదటి ఇద్దరిలో బంకిం ఒకడు.