This Day in History: 1965-12-27
1965 : సల్మాన్ ఖాన్ (అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు. SKF నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. యుఎస్ఎ పీపుల్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలో 7వ ఉత్తమ వ్యక్తి. ఇండియా పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్. ఎన్డిటివి పోల్ ఇండియాలో గొప్ప నటుడు. ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన 7వ వ్యక్తి. ఫోర్బ్స్ ఇండియా చార్ట్‌లో అగ్రస్థానం. న్యూయార్క్, లండన్ లలో ఆయన మైనపు విగ్రహాలు పెట్టారు. అనేక బిగ్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించిన తొమ్మిది మందిలో సల్మాన్ ఒకడు. హిట్ అండ్ రన్, ఐశ్వర్య రాయ్ అనుబంధం, కృష్ణ జింక వేట, 26/11 దాడుల వ్యాఖ్యలు, యూకబ్ మెమెన్ పై ట్వీట్ లు వివాదాలకు దారితీసాయి. అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.