This Day in History: 1969-02-28
1969 : పద్మశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ (ఉప్పలపు శ్రీనివాస్) జననం. భారతీయ మాండొలిన్ వాద్యకారుడు, స్వరకర్త.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు గురువు. సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత రత్న, సనాతన సంగీత పురస్కార్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, నేషనల్ సిటిజన్ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డులాంటి అనేక అవార్డులను గెలుచుకున్నాడు. తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవి పొందాడు. ఆయన పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు.
