2005-06-28 – On This Day  

This Day in History: 2005-06-28

2005 : భారతీయ పౌరసత్వ చట్టము అమలులోకి వచ్చింది.

ది ఇండియన్ సిటిజెన్‌షిప్ అండ్ నేషనాలిటీ లాభారతరాజ్యాంగం దేశంలోని భారతీయులంరికీ ఒకే విధమైన పౌరసత్వం మంజూరు చేస్తుంది. 1955 భారతీయ రాజ్యాంగ పౌరసత్వ చట్టము (సిటిజన్‌షిప్ లా 1955) రెండవ భాగములో 5 నుండి 11 వ అధ్యాయాలలో ఈ చట్ట వివరణ చోటు చేసుకుంది. ఈ చట్టములో 1986 వ సంవత్సరం, 1992 వ సంవత్సరం, 2003వ సంవత్సరం, 2005 వ సంవత్సరం లలో దిద్దుబాట్లు జరిగాయి. 2003 వ సంవత్సరం భారతీయ పౌరసత్వ చట్టములో జరిగిన దిద్దుబాట్లు 2004 జనవరి 7 వ తారీఖున భారత రాష్ట్రపతి ఆమోదము పొంది, 2004 డిసెంబరు 4 నుండి అమలులోకి వచ్చాయి. 2005 వ సంవత్సరంలో భారతీయ పౌరసత్వ చట్టములో జరిగిన దిద్దుబాట్లు భారత రాష్ట్రపతి ద్వారా ప్రతిపాదించబడి 2005 జూన్ 28 నుండి అమలులోకి వచ్చాయి. ఈ దిద్దుబాట్లు జరిగిన తరువాత భారతీయ పౌరసత్వ చట్టము జస్ సాన్‌గ్యుఇనిస్ (వారసత్వముగా పౌరసత్వ హక్కును కలిగి ఉండుట) ను అనుసరిస్తుంది. అలాగే ఇది జస్ సోలి (భారతదేశములో పుట్టిన కారణముగా పౌరసత్వ హక్కు లభించుట) ని వ్యతిరేకిస్తుంది.

చట్టము:

పుట్టుకతో పౌరసత్వం: 1950 జనవరి 26 నుండి 1986 లో జరిగిన పౌరసత్వ చట్టము అమలైన 1987 జూలై 1 మధ్య కాలములో పుట్టిన వారికి పుట్టుకతో పౌరసత్వపు హక్కు లభిస్తుంది. 1987 జూలై 1 నుండి, తల్లి తండ్రులలో ఒక్కరు భారతీయులై భారతదేశములో పుట్టినట్లైతే వారికిపౌరసత్వం లభిస్తుంది. 2004 డిసెంబరు 3 నుండి అమలులోకి వచ్చిన భారతీయ పౌరసత్వ చట్టానుసారం భారతీయ దంపతులకు పుట్టిన వారు లేక తల్లి తండ్రులలో ఒకరు భారతీయులై రెండవ వారు చట్ట విరుద్ధమైన వలస ప్రజ కాని వారైతే, వారికి పుట్టిన శిశువుకు, భారతదేశములో జన్మించినట్లైతే, భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

వారసత్వముగా పౌరసత్వం:

పౌరసత్వము నమోదు చేయుట:

1955 భారతీయ పౌరసత్వ చట్టం 5 వ విభాగమును అనుసరించి, భారతీయ పౌరసత్వం పొందాలంటే, భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తు పెట్టుకున్న వారు చట్టవిరుద్ధంగా భారతదేశములో నివసిస్తూ ఉండకూడదు. అతడు ఈ క్రింది కేటగిరీలలో ఏదైనా ఒకదానికి చెందిన వాడై ఉండాలి.

Share