1909-07-28 – On This Day  

This Day in History: 1909-07-28

1909 : కాసు బ్రహ్మానందరెడ్డి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి. మహారాష్ట్ర 14వ గవర్నర్. 11వ హోమ్ వ్యవహారాల మంత్రి (ఇండియా). గుంటూరు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను నిర్వహించాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజక వర్గం నుండి ఎన్నికై, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా కొనసాగాడు. కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పార్టీలో చీలిక వచ్చినపుడు ఒక వర్గానికి తాను నేతృత్వం వహించి, రెడ్డి కాంగ్రెసును ఏర్పరచాడు.