This Day in History: 1982-09-28
1982 : పద్మ భూషణ్ అభినవ్ అప్జిత్ బింద్రా జననం. భారతీయ స్పోర్ట్స్ షూటర్, వ్యాపారవేత్త. అర్జున అవార్డు గ్రహీత. వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు. ‘అభినవ్ బింద్రా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. ‘అభినవ్ ఫ్యూచరిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు. అభినవ్ బింద్రా స్పోర్ట్స్ మెడిసిన్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్స్ కమీషన్ సభ్యుడు. అర్జున అవార్డు, మేజర్ ధ్యాన చంద్ ఖేల్ రత్న లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.