This Day in History: 1901-11-29
1901 : పద్మశ్రీ శోభా సింగ్ జననం. భారతీయ చిత్రకారుడు. గురు అమర్ దాస్, గురు తేజ్ బహాదూర్, గురు హర్ కిషన్ వంటి అనేక చిత్రాలను చిత్రించాడు. ఆయన చిత్రించిన సోహ్ని మహివాల్, హీర్ రంజా చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. జాతీయ నాయకులైన షహీద్ భగత్ సింగ్, కర్తార్ సింగ్ సరభా, మహాత్మా గాంధీ, లాల్ బహాదూర్ శాస్త్రి మొదలైన చిత్రాలను కూడా చిత్రించాడు. అనేక గౌరవ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.