This Day in History: 1993-11-29
1993 : భారతరత్న జె ఆర్ డి (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా) మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. టాటా గ్రూప్ ఛైర్మన్. భారత పౌరవిమానయాన పితామహుడు. ఇండియాలో మొట్టమొదటి పైలెట్ లైసెన్స్ పొందాడు. రతన్‌జీ దాదాభోయ్ టాటా కుమారుడు. టాటా ఎయిర్ లైన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, వోల్టాస్ లాంటి పరిశ్రమల వ్యవస్థాపకుడు. ది హిస్టరీ ఛానల్ ‘ది గ్రేటెస్ట్ ఇండియన్’ పోల్ లో ఆరవ స్థానంలో ఎంపికైయ్యాడు. పద్మ విభూషణ్, భారతరత్న తో పాటు అనేక నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందాడు.