This Day in History: 1973-12-29
1973 : ట్వింకిల్ ఖన్నా (టీనా జతిన్ ఖన్నా) జననం. భరతీయ సిని నటి, నిర్మాత, రచయిత్రి, పత్రికా వ్యాసకర్త, ఇంటీరియర్ డిజైనర్. ప్రముఖ నటులు డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నా ల కుమార్తె. నటుడు అక్షయ కుమార్ ను వివాహం చేసుకుంది. ది వైట్ విండో ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపార సంస్థ సహ యజమాని. బర్సాత్ హిందీ సినిమాతో ఆరంగేట్రం చేసింది. ఆమె రచించిన నాన్-ఫిక్షన్ పుస్తకం మిస్సెస్ ఫన్నీబోన్స్ వల్ల ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మహిళా రచయిత్రిగా నిలిచింది. ఫిల్మ్ ఫేర్, బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు అందుకుంది.
