This Day in History: 1928-06-30
1928 : జె వి సోమయాజులు (జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘రసరంజని’ నాటకరంగ సహ వ్యవస్థాపకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. తెలుగు ప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. ఆయన తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చి అందులో “రామప్ప పంతులు” పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.