This Day in History: 1883-10-30
1883 : దయానంద సరస్వతి (మూల శంకర్ తివారీ) మరణం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, సామాజిక గురువు. ‘ఆర్య సమాజ్’ వ్యవస్థాపకుడు. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలను ఎదురించి పోరాడాడు. హిందు ధర్మ సంస్థాపనకు పాటుపడ్డాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వరాజ్యం కోసం “భారతీయుల కోసం భారతదేశం” అని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి దయానంద.