This Day in History: 1948-11-30
1948 : కె. ఆర్. విజయ (దేవనాయకి) జననం. భారతీయ సినీనటి, రంగస్థల నటి, టీవి ప్రెజంటర్. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో పనిచేసింది. తల్లి కళ్యాణి, తండ్రి రామచందర్ పేర్లతో విజయగా పేరు మార్చుకుంది. ఆమె భర్త వేలాయుధంకి స్వంత జెట్ ఉండటం చేత దేశంలో ప్రైవేట్ జెట్ ఉన్న మొట్టమొదటి నటిగా పేరొచ్చింది. ఆమె అభిమానులు ఆమెను పున్నగై అరసి (చిరునవ్వుల రాణి) అని పిలుస్తారు. కేరళ స్టేట్ ఫిల్మ్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, జన్మభూమి టెలివిజన్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకుంది.