This Day in History: 1984-10-31
1984 : భారతరత్న ఇందిరా గాంధీ (ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ) మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 3వ ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రి. భారతరత్న పురస్కారం పొందిన మొదటి మహిళ.
ఐరెన్ లేడి ఆఫ్ ఇండియా బిరుదు పొందింది. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు. జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. రాజీవ్ గాంధీ తల్లి. పలు రాజ్యాంగ వ్యవస్థల పతనానికి నాంది పలికిన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొంది. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి చేత దుర్గామాతగా కీర్తించబడింది. లెనిన్ శాంతి బహుమతి పొందింది. BBC ద్వారా “ఉమెన్ ఆఫ్ ది మిలీనియం” గా ఎంపికయ్యింది.