tomorrow – On This Day  

tomorrow

దినోత్సవం

పదాతిదళ దినోత్సవం (ఇండియా)

ప్రపంచ ఆడియోవిజువల్ హెరిటేజ్ దినోత్సవం

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ స్వాతంత్ర్య దినోత్సవం (యునైటెడ్ కింగ్‌డమ్ నుండి)

ప్రపంచ ఆక్యుపేషనల్ థెరపీ దినోత్సవం

సంఘటనలు

1971 : డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం పేరును కాంగో లో ఉన్న జైర్ నది పేరుతో  'రిపబ్లిక్ ఆఫ్ జైర్' గా మార్చబడింది.

జననం

1920 : కె ఆర్ నారాయణన్ (కొచెరిల్ రామన్ నారాయణన్) జననం. భారతీయ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. భారతదేశ 10వ రాష్ట్రపతి. ఈ పదవి పొందిన మొదటి దళితుడు. 9వ ఉపరాష్ట్రపతి.

1941 : పళనిస్వామి (శివకుమార్‌) జననం. భారతీయ తమిళ సినిమా నటుడు. తమిళంలో 190కి పైగా సినిమాల్లో నటించాడు. టీవి సీరియల్స్ లో కూడా సుపరిచితుడు. ప్రముఖ హీరోలు సూర్య, కార్తీ ఈయన కుమారులే. ఫిల్మ్ ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అన్నా సెంచరీ లైబ్రేరి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్, విజయా అవార్డులను అందుకున్నాడు.

1954 : అనురాధ పౌడ్వాల్ (అల్కా నాదకర్ణి) జననం. భారతీయ హిందీ నేపథ్య గాయని, భజన్ గాయని. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. భజన్ క్వీన్, మెలోడీ క్వీన్ బిరుదులు పొందింది.

1976 : పూజా బాత్రా జననం. భారతీయ హిందీ నటి మరియు మోడల్. లిరిల్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ లో ఫేమస్ అయింది. మిస్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలో సెమీ ఫైనల్ వరకు వెళ్ళింది, ఆమె 1993 మిస్ ఇండియా పోటీలో పాల్గొని మూడో స్థానంలో రన్నరప్‌గా నిలిచింది.

1977 : కుమార్ చోక్షనాద సంగక్కర జననం. శ్రీలంక క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్, వ్యాపారవేత్త, మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు. క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా, అగ్రశ్రేణి వికెట్ కీపర్‌గా పరిగణించబడ్డాడు. ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఐసిసి ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లాంటి అవార్డులు గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

ఇర్ఫాన్ ఖాన్ పఠాన్ జననం. మాజీ భారతీయ క్రికెటర్, నటుడు. మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసఫ్ పఠాన్ సోదరుడు. అతను బౌలింగ్ ఆల్ రౌండర్. 2007 ICC 20-20 ప్రపంచ కప్‌, 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులలో ప్లేయర్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2004. ఒకే మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన యువ ఆటగాళ్ళ లిస్ట్ లో తొమ్మిదవ ర్యాంక్ కలిగిఉన్నాడు.

మరణం

1605 : అబుల్-ఫత్ జలాల్-ఉద్-దిన్ ముహమ్మద్ అక్బర్ (బద్రుద్దీన్ ముహమ్మదు అక్బరు) మరణం. అక్బర్ ది గ్రేట్, అక్బర్ 1 అని కూడా పిలుస్తారు. ఆయన 1556 నుండి 1605 వరకు భారతదేశాన్ని పరిపాలించిన మూడవ మొఘల్ చక్రవర్తి. కొందరు గంగానది నుండి కలుషితమైన నీరు తాగడం వలన అక్బర్ విరోచనాలతో మరణించినట్లు, మరికొందరు విష ప్రయోగం జరిగిందని విశ్వసిస్తున్నారు.

1940 : గోండు బెబ్బులి కొమురం భీమ్ మరణం. భారతీయ గిరిజన నాయకుడు, తిరుగుబాటుదారుడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడిన ఉద్యమకారుడు. జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) అనే నినాదంతో వీర మరణం పొందాడు.

చరిత్ర కొనసాగుతుంది..