- దినోత్సవం
ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
ప్రపంచ రొట్టె దినోత్సవం
ప్రపంచ వెన్నెముక దినోత్సవం
ప్రపంచ రీస్టార్ట్ ఎ హార్ట్ దినోత్సవం
- సంఘటనలు
1905 : భారతదేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ను రెండుగా విభజించడంతో పశ్చిమ భూభాగం హిందూ మెజారిటీకి, తూర్పు భూభాగం ముస్లిం మెజారిటీకి చెందేలా అమల్లోకి వచ్చింది. (1. 'బెంగాల్' (పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ మరియు ఒరిస్సా ప్రావిన్స్‌తో కూడినది) మరియు 2. తూర్పు బెంగాల్ మరియు అస్సాం, డక్కా రాజధానిగా కూడినది.)
1968 : సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి జపనీస్ వ్యక్తిగా యసునారి కవాబాట నిలిచాడు.
1968 : భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర గోవింద ఖొరానా 'మెడిసిన్ అండ్ ఫిజియాలజీ' విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.
1973 : పారిస్ శాంతి ఒప్పందాలపై చర్చలు జరిపినందుకు లే డక్ థో మరియు హెన్రీ కిసింజర్ లకు సంయుక్తంగా 1973 నోబెల్ శాంతి బహుమతి లభించింది.
1990 : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో భారత రాష్ట్రపతి ఆర్. వెంకటరమణ నెల్సన్ మండేలా ను భారతరత్న తో పురస్కరించారు.
- జననం
1878 : పద్మ భూషణ్ వల్లతోల్ నారాయణ మీనన్ జననం. భారతీయ మలయాళ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, కవి, అనువాదకుడు. మహాకవి బిరుదు పొందాడు. కేరళ కళామండపం వ్యవస్థాపకుడు.
1896 : పద్మ భూషణ్ సేథ్ గోవింద్ దాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. హిందీ ని భారత జాతీయ భాషగా రావడానికి కృషి చేశాడు.
1948 : పద్మశ్రీ హేమ మాలిని (హేమమాలిని చక్రవర్తి) జననం. భారతీయ హిందీ సినీ నటి, నర్తకి, రచయిత్రి, దర్శకురాలు, నిర్మాత, రాజకీయవేత్త, సంపాదకురాలు, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. సినీ నటుడు ధర్మేంద్ర ను వివాహం చేసుకుంది.
1971 : డేవిడ్ జూడ్ జాన్సన్ జననం. మాజీ భారత క్రికెటర్, 1996 లో 2 టెస్టులు ఆడాడు. ఇండియాలో అత్యంత వేగవంతమైన బౌలర్ లలో ఒకడు. కోట్లా టెస్ట్‌లో గంటకు 156.9 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి రికార్డు నెలకొల్పాడు. కానీ తన బౌలింగ్ పై నియంత్రణ లేని బౌలర్ గా పరిగణింపబడ్డాడు.
1982 : పృథ్వీరాజ్ సుకుమారన్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, ప్లేబ్యాక్ సింగర్, డిస్ట్రిబ్యూటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
1990 : అనిరుధ్ (అనిరుధ్ రవిచందర్) జననం. భారతీయ సినీ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు. సినీ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు.
- మరణం
1951 : నవాబ్జాదా ముహమ్మద్ లియాఖత్ అలీ ఖాన్ మరణం. భారతీయ పాకిస్తానీ రాజకేయవేత్త, న్యాయవాది, రాజనీతజ్ఞుడు, ఉద్యమకారుడు. పాకిస్తాన్ మొదటి ప్రధాన మంత్రి. పూర్వ భారతదేశ చివరి ఆర్థిక మంత్రి. పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు.
2022 : పద్మ విభూషణ్ దిలీప్ మహలనాబిస్ మరణం. భారతీయ శిశు వైద్యుడు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) పితామహుడు.
చరిత్ర కొనసాగుతుంది..