Birth – On This Day  

Birth

1916 : నాయక్ జదునాథ్ సింగ్ రాథోడ్ జననం. భారతీయ ఆర్మీ సైనికుడు. పరమ వీర చక్ర గ్రహీత. 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో చర్యలకు భారతదేశ అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమవీర చక్ర (PVC) మరణానంతరం లభించింది.

1941 : ఆనందిబెన్ (ఆనందిబెన్ మఫత్-భాయ్ పటేల్) జననం. భారతీయ ఉపాధ్యాయురాలు, రాజకీయవేత్త. గుజరాత్ 15వ ముఖ్యమంత్రి. గుజరాత్ లో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళ. ఉత్తరప్రదేశ్ 20వ గవర్నర్‌. మధ్యప్రదేశ్ 17వ గవర్నర్‌. ఛత్తీస్‌గఢ్ అదనపు గవర్నర్.

1982 : మిస్ ఇండియా వరల్డ్ వైడ్ ఆర్తి చాబ్రియా జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, ప్రచారకర్త, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 1999 విజేత. మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీఫుల్ విజేత.

1987 : నేహా శర్మ జననం. భారతీయ నటి, మోడల్. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, పంజాబీ, చైనీస్ భాషా చిత్రాలలో పనిచేసింది. గూగుల్ జైట్జీస్ట్ ప్రచురణలో భారతదేశంలో అత్యంత వేగంగా ఫేమస్ అవుతున్న వ్యక్తుల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మంది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ గా స్థానం దక్కించుకుంటూనే ఉంది. హాటెస్ట్ ఫిమేల్ టైమ్స్ పోల్‌లో నంబర్ 1 సాధించింది. ప్రపంచంలోని 100 సెక్సీయెస్ట్ మహిళలు ఎఫ్హెచ్ఎం లో నంబర్ 7 లో నిలిచింది. చండీగఢ్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 13వ స్థానంలో నిలిచింది.