జననం – పేజీ 178 – On This Day  

1939-10-15

1939 : జి. రామకృష్ణ జననం. భారతీయ చలనచిత్ర నటుడు. ఆయన తెలుగు, తమిళం మరియు మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాలలో నటించాడు. అప్పటి కథానాయకి గీతాంజలి ఈయన భార్య.

1901-10-22

1901 : గోండు బెబ్బులి కొమురం భీమ్ జననం. భారతీయ గిరిజన నాయకుడు, తిరుగుబాటుదారుడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడిన ఉద్యమకారుడు. జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) అనే నినాదంతో వీర మరణం పొందాడు.

1988-10-22

1988 : పరిణీతి చోప్రా జననం. భారతీయ సినీ నటి, గాయని, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటి ప్రియాంకా చోప్రా సోదరి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చేర్చబడింది. Continue reading “1988-10-22”

1971-10-22

1971 : కొడాలి నాని (కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు) జననం. భారతీయ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి. అతను కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు.

1931-10-21

1931 : ఎల్విస్ ప్రెస్లీ ఆఫ్ ఇండియా షమ్మీ కపూర్ (షంషేర్ రాజ్ కపూర్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు. ఫస్ట్ రాక్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత.

Continue reading “1931-10-21”

1967-10-21

1967 : అశ్విని నాచప్ప జననం. భారతీయ క్రీడాకారిణి, సినీ నటి. అర్జున అవార్డు గ్రహీత. ‘అశ్వినీస్ స్పోర్ట్స్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు. మహిళల పరుగుపందెoలో పి టి ఉష రికార్డును రెండు సార్లు అధికమించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకుంది.

1978-10-21

1978 : కళైమామణి సంగీత జననం. భారతీయ సినీ నటి, గాయని, నృత్యకారిణి, టెలివిజన్ ప్రెజెంటర్. నేపధ్య గాయకుడు క్రిష్ ను వివాహం చేసుకుంది.

1833-10-21

1833 : ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ జననం. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యాపారవేత్త. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు. డైనమైట్ కనుగొన్నాడు. బోఫోర్స్ ఆయుధాల కంపెనీ యజమాని. కృత్రిమ మూలకము నోబెలియం కు ఈయన పేరు మీదునే నామకరణం చేసారు.

1978-10-20

1978 : పద్మశ్రీ వీరేంద్ర సెహ్వాగ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1978-10-20”

1958-10-20

1958 : ప్రభ (కోటి సూర్య ప్రభ) జననం. భారతీయ నటి మరియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి నర్తకి. ఆమె తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో 125 సినిమాలలో నటించింది. రెండు నంది అవార్డులను గెలుచుకుంది.