1982 : పృథ్వీరాజ్ సుకుమారన్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, ప్లేబ్యాక్ సింగర్, డిస్ట్రిబ్యూటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
Event Type: జననం
1948-10-16
1948 : పద్మశ్రీ హేమ మాలిని (హేమమాలిని చక్రవర్తి) జననం. భారతీయ హిందీ సినీ నటి, నర్తకి, రచయిత్రి, దర్శకురాలు, నిర్మాత, రాజకీయవేత్త, సంపాదకురాలు, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. సినీ నటుడు ధర్మేంద్ర ను వివాహం చేసుకుంది.
1990-10-16
1990 : అనిరుధ్ (అనిరుధ్ రవిచందర్) జననం. భారతీయ సినీ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు. సినీ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు.
1940-10-15
1940 : పీటర్ చార్లెస్ డోహెర్టీ జననం. ఆస్ట్రేలియన్ సర్జన్ మరియు ఇమ్యునాలజిస్ట్. ఆల్బర్ట్ లాస్కర్ అవార్డు, నోబెల్ గ్రహీత. 1997 లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
1957-10-15
1957 : మీరా నాయర్ జననం. భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత. ఆమె నిర్మాణ సంస్థ మీరాబాయి ఫిల్మ్స్. యునెస్కో అవార్డు, ఆసియన్ మీడియా అవార్డు, గోల్డెన్ లయన్ అవార్డు లాంటి ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు ఇండియా అబ్రాడ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2007, పద్మ భూషణ్ గౌరవ పురస్కారం పొందింది.
1920-10-15
1920 : పద్మ భూషణ్ భూపతిరాజు విస్సం రాజు జననం. భారతీయ పారిశ్రామికవేత్త. రాశీ సిమెంట్ వ్యవస్థాపకుడు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. భారతీయ సిమెంట్ పరిశ్రమ మార్గదర్శకులలో ఒకడు.
1931-10-15
1931 : భారతరత్న అబ్దుల్ కలాం (అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం) జననం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. భారతదేశ 11వ రాష్ట్రపతి.
1986-10-15
1986 : పంజా సాయి ధరమ్ తేజ్ జననం. భారతీయ తెలుగు చిత్ర నటుడు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో తొలిసారిగా ప్రధాన పాత్ర పోషించాడు, దీనికి అతను ఉత్తమ నటుడు గా సంతోషం ఫిల్మ్ అవార్డు, సినీ మా అవార్డు, సైమా అవార్డు లను అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కి మేనల్లుడు.
1975-10-15
1975 : బ్లేజ్ (లక్ష్మీ నరసింహ విజయ రాజగోపాల శేషాద్రి శర్మ రాజేష్ రామన్) జననం. భారతీయ తమిళ, తెలుగు భాషా నేపథ్య గాయకుడు మరియు రాప్ సంగీతాన్ని రాయడంలో మరియు ప్రదర్శించడంలో నైపుణ్యం కలిగిన భారతీయ రాపర్.
1909-10-14
1909 : సూరి భగవంతం జననం. భారతీయ శాస్త్రవేత్త మరియు నిర్వాహకుడు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్, డి.ఆర్.డి.ఓ డైరెక్టర్, కరెంట్ సైన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.