1840 : హిరామ్ స్టీవెన్స్ మాగ్జిమ్ జననం. బ్రిటీష్ అమెరికన్ ఆవిష్కర్త. మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ ‘మాగ్జిమ్ గన్’ సృష్టికర్త. ఎలెక్ట్రిక్ లైట్లు, కార్బన్ కండక్టర్ల తయారీ మీద పేటెంట్లు పొందాడు.
Event Type: జననం
1951-11-19
1951 : మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ జీనత్ అమన్ (జీనత్ ఖాన్) జననం. భారతీయ సినీ నటి, మోడల్. ‘ఫస్ట్ ప్రిన్సెస్’ బిరుదు పొందింది. ఫెమినా మిస్ ఇండియా 1970 రన్నరప్. మిస్ ఫోటోజెనిక్ టైటిల్ విజేత. మిస్ ఆసియా పసిఫిక్ 1970 టైటిల్ విజేత. అంతర్జాతీయ పోటీలో గెలుపొందిన మొదటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్.
1942-11-19
1942 : కాల్విన్ రిచర్డ్ క్లైన్ జననం. అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్. ‘కాల్విన్ క్లైన్ ఇంక్.’ వ్యవస్థాపకుడు.
1976-11-19
1976 : జాక్ పాట్రిక్ డోర్సే జననం. అమెరికన్ ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు, పరోపకారి, ప్రోగ్రామర్. ‘ట్విటర్ ఇంక్.’ సోషల్ మీడియా కంపెనీ సహ వ్యవస్థాపకుడు. ‘బ్లాక్ ఇంక్.’ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు.
1852-11-19
1852 : అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ జననం. భారతీయ న్యాయవాది, బ్యాంకర్, విద్యావేత్త, సంఘ సంస్కర్త. ‘కెనరా బ్యాంక్’ వ్యవస్థాపకుడు. మంగళూరు కెనరా హైస్కూల్ స్థాపకుడు.
1960-11-19
1960 : శుభలేఖ సుధాకర్ (సూరావఝుల సుధాకర్) జననం. భరతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. ‘నంది’ టీవి అవార్డు గ్రహీత. నేపధ్య గాయని ఎస్ పి శైలజ ను వివాహం చేసుకున్నాడు.
1973-11-19
1973 : షకీలా (సి షకీలా బేగం) జననం. భారతీయ సినీ నటి, అశ్లీల నటి, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.
1926-09-27
1926 : హిందూ హృదయ్ సామ్రాట్ అశోక్ సింఘాల్ జననం. భారతీయ హిందూ జాతీయవాది, గాయకుడు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమానికి ఇన్‌ఛార్జ్. హిందుస్తానీ సంగీతంలో శిక్షణ పొందిన గాయకుడు. ధర్మశ్రీ పురస్కారం లభించింది.
1929-01-08
1929 : పద్మశ్రీ సయీద్ జాఫ్రీ జననం. బ్రిటిష్ భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. బ్రిటీష్, కెనడియన్ ఫిల్మ్ అవార్డ్ నామినేషన్లను అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి. నాటక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ OBE గౌరవాన్ని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి.
1926-09-01
1926 : పద్మశ్రీ బిజ్జీ (విజయదాన్ దేథా) జననం. భారతీయ రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రాజస్థాన్ రత్న గ్రహీత. నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.