జననం – Page 5 – On This Day  

1904-12-29

1904 : పద్మ విభూషణ్ కువెంపు (కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప) జననం. భారతీయ కవి, నాటక రచయిత, నవలా రచయిత, విమర్శకుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి కన్నడ రచయిత. రాష్ట్రకవి, కర్ణాటక రత్న గౌరవ పురస్కారాలు పొందాడు. కర్ణాటక రాష్ట్ర గీతం ‘జయ భారత జననీయ తనూజాతే’ రచించాడు.

1920-11-10

1920 : దత్తోపంత్ బాపురావ్ తెంగడి (దత్తాత్రేయ బాపురావు తేంగడి) జననం. భారతీయ హిందూ సిద్ధాంతకర్త, ట్రేడ్ యూనియన్ నాయకుడు. ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ వ్యవస్థాపకుడు. ‘భారతీయ మజ్దూర్ సంఘ్’ వ్యవస్థాపకుడు. ‘భారతీయ కిసాన్ సంఘ్’ వ్యవస్థాపకుడు. పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించాడు.

1919-11-10

1919 : హీరో ఆఫ్ రష్యా మిఖాయిల్ కలాష్నికోవ్ (మిఖాయిల్ టిమోఫీవిచ్ కలాష్నికోవ్) జననం. సోవియట్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్, ఆవిష్కర్త, సైనిక ఇంజనీర్, రచయిత, చిన్న ఆయుధాల డిజైనర్. ‘AK-47’ అసాల్ట్ రైఫిల్ కనుగొన్నాడు. AKM, AK-74, RPK లైట్ మెషిన్ గన్, PK మెషిన్ గన్‌లను అభివృద్ధి చేశాడు.

1889-11-04

1889 : జమ్నాలాల్ బజాజ్ (జమ్నాలాల్ కనీరామ్ బజాజ్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, పరోపకారి, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు. మహాత్మా గాంధీ దత్త కుమారుడు. ‘రాయ్ బహదూర్’ బిరుదును వదులుకున్నాడు.

1963-10-28

1963 : ఉర్జిత్ పటేల్ (ఉర్జిత్ రవీంద్ర పటేల్) జననం. భారతీయ కెన్యా ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24వ గవర్నర్‌. పదవికి రాజీనామా చేసి రాజీనామా చేయడానికి చోదక కారకంగా వ్యక్తిగత కారణాలను తెలిపిన మొదటి RBI గవర్నర్.

1955-10-28

1955 : పద్మ భూషణ్ బిల్ గేట్స్ (విలియం హెన్రీ గేట్స్ III) జననం. అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి, రచయిత. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు. టెర్రాపవర్, బెన్, క్యాస్కేడ్ ఇన్వెస్ట్‌మెంట్, bgC3, బ్రేక్‌త్రూ ఎనర్జీ లాంటి కంపెనీల వ్యవస్థాపకుడు.

1945-10-25

1945 : పద్మశ్రీ అపర్ణ సేన్ (అపర్ణ దాస్‌గుప్తా) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, స్క్రీన్ రైటర్, సంపాదకురాలు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1945-10-25”

1979-10-23

1979 : రోంజన్ సోధీ (రోంజన్ సింగ్ సోధీ) జననం. భారతీయ డబుల్ ట్రాప్ షూటర్. అర్జున అవార్డు గ్రహీత. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.  ప్రపంచకప్‌లో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడు.

 

1915-10-21

1915 : కళాప్రపూర్ణ విద్వాన్ విశ్వం (మీసరగండ విశ్వరూపాచారి) జననం. భారతీయ సాహిత్యవేత్త, రచయిత, సంపాదకుడు.

1995-10-20

1995 : ముగెన్ రావ్ జననం. భరతీయ మలేషియన్ తమిళ సినీ నటుడు, గాయకుడు, గీత రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 టైటిల్ విజేత.