జననం – పేజీ 42 – On This Day  

1923-03-28

1923 : మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ (మన్నవ అనసూయ దేవి) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, అన్నదాత. అన్నదాన కార్యక్రమం కోసం అన్నపూర్ణాలయం స్థాపించింది. ‘మాతృశ్రీ విద్యా పరిషద్’, ‘మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి’, ‘మాతృశ్రీ మెడికల్ సెంటర్’లు స్థాపించింది. ఆమె జ్ఞాపకార్ధం ‘అనసూయేశ్వరాలయం’ నిర్మించారు.

1982-03-28

1982 : సోనియా అగర్వాల్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. సినీ దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకుంది.

1997-03-28

1997 : అను ఇమ్మాన్యుయేల్ జననం. అమెరికన్ భారతీయ సినీ నటి. సినీ నిర్మాత థంకచన్ ఇమ్మాన్యుయేల్ కుమార్తె.

1975-03-28

1975 : అక్షయ్ ఖన్నా జననం. భారతీయ హిందీ సినీ నటుడు. సినీ నటుడు వినోద్ ఖన్నా కుమారుడు.

1797-05-02

1797 : అబ్రహం పినియో గెస్నర్ జననం. కెనడియన్ వైద్యుడు, భూగర్భ శాస్త్రవేత్త. కిరోసిన్‌ కనుగొన్నాడు.

1922-01-01

1922 : పద్మశ్రీ తెంఫుంగా సయిలో జననం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. మిజోరం 2వ ముఖ్యమంత్రి. ‘మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.

1899-03-27

1899 : పద్మ భూషణ్ లక్ష్మీ నందన్ మీనన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు, న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ కేంద్ర విదేశాంగ మంత్రి. పద్మ భూషణ్ అవార్డు అందుకున్న రెండవ మలయాళీ. భారతదేశంలో ‘మదర్స్ డే’ ని ప్రతిపాదించింది.

1936-03-27

1936 : బన్వారీ లాల్ జోషి జననం. భారతీయ సివిల్ సర్వెంట్, ప్రభుత్వ అధికారి. ఉత్తర ప్రదేశ్ 18వ గవర్నర్‌. Continue reading “1936-03-27”