జననం – Page 7 – On This Day  

1977-10-08

Manchu Lakshmi Prasanna1977 : లక్ష్మీ మంచు (మంచు లక్ష్మి ప్రసన్న) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్. ‘శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థ సహ యజమాని. సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె.

1905-09-03

Kamalapati-Tripathi1905 : కమలపతి త్రిపాఠి జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, జర్నలిస్ట్. ఉత్తరప్రదేశ్ 7వ ముఖ్యమంత్రి.

 ఉత్తరప్రదేశ్ 2వ ఉప ముఖ్యమంత్రి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి. యునైటెడ్ ప్రావిన్స్ నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

1940-10-05

Nar Bahadur Bhandari1940 : జగదాంబ శ్రీ నార్ బహదూర్ భండారీ జననం. భారతీయ రాజకీయవేత్త. సిక్కిం 2వ ముఖ్యమంత్రి. ‘సిక్కిం సంగ్రామ్ పరిషత్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆధునిక సిక్కిం వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు.

Continue reading “1940-10-05”

1978-10-04

Soha Ali Khan Pataudi1978 : సోహా అలీ ఖాన్ (సోహా అలీ ఖాన్ పటౌడీ) జననం. భారతీయ సినీనటి, టెలివిజన్ ప్రజెంటర్, రచయిత, మోడల్.  క్రాస్‌వర్డ్ బుక్ అవార్డు గ్రహీత. సినీనటి షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ల కుమార్తె. సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ సోదరి.

1980-10-04

Shweta Tiwari1980 : శ్వేతా తివారీ జననం. భారతీయ హిందీ సినీనటి, మోడల్, టెలివిజన్‌ ప్రజెంటర్. రియాలిటీ షో బిగ్ బాస్ సిరీస్ లో విజేతగా నిలిచిన మొదటి మహిళ.

1953-10-03

Dipak Misra1953 : దీపక్ మిశ్రా జననం. భారతీయ న్యాయనిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తి. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

1890-10-03

Laxminarayan Sahu lakshmi narayan laxmi1890 : పద్మశ్రీ లక్ష్మీనారాయణ సాహు జననం. భారతీయ రచయిత, కవి, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఒడిశా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ‘ఇతిహాసరత్న’ బిరుదు పొందాడు. అంటరానితనం, మహిళలపై సాంఘిక దూరచరాలకు వ్యతిరేకంగా పోరాడాడు.

1938-07-03

Mathukumilli Veera Venkata Satyanarayana Murthi mvvs1938 : ఎం వి వి ఎస్ మూర్తి (మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి) జననం. భారతీయ రాజకీయవేత్త. గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (GITAM) వ్యవస్థాపకుడు.

1942-10-02

Asha Parekh1942 : పద్మశ్రీ ఆశా పరేఖ్ జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

1974-10-02

Rachna Banerjee Jhumjhum1974 : మిస్ బ్యూటీఫుల్ స్మైల్ రచన (ఝుంఝుం బెనర్జీ) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్, వ్యాపారవేత్త. మిస్ కోల్‌కతా 1994 టైటిల్ విజేత.