2016 : పద్మశ్రీ నిదా ఫజ్లీ (ముక్తిదా హసన్ నిదా ఫజ్లీ) మరణం. భారతీయ హిందీ మరియు ఉర్దూ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
Event Type: మరణం
1967-10-12
1967 : రామ్ మనోహర్ లోహియా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంపాదకుడు, రాజకీయవేత్త. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన చివరి దశలో 1942 వరకు బొంబాయిలోని వివిధ ప్రాంతాల నుండి రహస్యంగా ప్రసారం చేయబడిన కాంగ్రెస్ రేడియోలో పనిచేశాడు.
1963-10-09
1963 : సైఫుద్దీన్ కిచ్లేవ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త, శాంతి ఉద్యమ నాయకుడు. ‘జామియా మిలియా ఇస్లామియా’ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సభ్యుడు. లెనిన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఆయన అరెస్ట్ జలియన్ వాలాబాగ్ వద్ద హిందూ, సిక్కు, ముస్లిం నిరసనకారులతో కూడిన భారీ సమావేశాన్ని ప్రేరేపించింది మరియు ఊచకోతకు గురయ్యారు. భారతదేశ విభజనను వ్యతిరేకించాడు.
2017-07-16
2017 : జగదాంబ శ్రీ నార్ బహదూర్ భండారీ మరణం. భారతీయ రాజకీయవేత్త. సిక్కిం 2వ ముఖ్యమంత్రి. ‘సిక్కిం సంగ్రామ్ పరిషత్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆధునిక సిక్కిం వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు.
1963-01-18
1963 : పద్మశ్రీ లక్ష్మీనారాయణ సాహు మరణం. భారతీయ రచయిత, కవి, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఒడిశా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ‘ఇతిహాసరత్న’ బిరుదు పొందాడు. అంటరానితనం, మహిళలపై సాంఘిక దూరచరాలకు వ్యతిరేకంగా పోరాడాడు.
2023-09-28
2023 : భారతరత్న ఎం ఎస్ స్వామినాధన్ (మంకొంబు సాంబశివన్ స్వామినాథన్) మరణం. భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కల జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ‘MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “2023-09-28”
2004-09-27
2004 : పద్మ భూషణ్ శోభా గుర్తు (భానుమతి శిరోద్కర్) మరణం. భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ గాయని. సంగీత నాటక ఆకడమీ అవార్డు గ్రహీత. ‘తుమ్రీ క్వీన్’ బిరుదు పొందింది.
2023-07-06
2023 : గద్దర్ మరణం
1572-02-28
1572 : ఉదయ్ సింగ్ II మరణం. భరతీయ రాజు. మేవార్ రాజ్యానికి 12వ మహారాణా. ఉదయపూర్ నగర స్థాపకుడు. మహారాణా ప్రతాప్ ఈయన కుమారుడే.
2002-03-30
2002 : ది క్వీన్ మదర్ క్వీన్ ఎలిజబెత్ (ఎలిజబెత్ ఏంజెలా మార్గ్యురైట్ బోవ్స్-లియాన్) మరణం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. యునైటెడ్ కింగ్ జార్జ్ VI సతీమణి. భారతదేశానికి చివరి సామ్రాజ్ఞి.