మరణం – Page 3 – On This Day  

1909-07-25

1909 : అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ మరణం. భారతతీయ న్యాయవాది, బ్యాంకర్, విద్యావేత్త, సంఘ సంస్కర్త. ‘కెనరా బ్యాంక్’ వ్యవస్థాపకుడు. మంగళూరు కెనరా హైస్కూల్ స్థాపకుడు.

2014-12-04

2014 : పద్మ విభూషణ్ వి ఆర్ కృష అయ్యర్ (వైద్యనాథపురం రామ కృష్ణ అయ్యర్) మరణం. భారతీయ న్యాయ నిపుణుడు,  సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కేరళ హైకోర్టు న్యాయమూర్తి. భారతదేశంలో న్యాయ-సహాయ ఉద్యమానికి మార్గదర్శకుడు.

2015-11-15

2015 : పద్మశ్రీ సయీద్ జాఫ్రీ మరణం. బ్రిటిష్ భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. బ్రిటీష్, కెనడియన్ ఫిల్మ్ అవార్డ్ నామినేషన్లను అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి. నాటక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ OBE గౌరవాన్ని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి.

2004-10-14

2004 : దత్తోపంత్ బాపురావ్ తెంగడి (దత్తాత్రేయ బాపురావు తేంగడి) మరణం. భారతీయ హిందూ సిద్ధాంతకర్త, ట్రేడ్ యూనియన్ నాయకుడు. ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ వ్యవస్థాపకుడు. ‘భారతీయ మజ్దూర్ సంఘ్’ వ్యవస్థాపకుడు. ‘భారతీయ కిసాన్ సంఘ్’ వ్యవస్థాపకుడు. పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించాడు.

2013-12-23

2013 : హీరో ఆఫ్ రష్యా మిఖాయిల్ కలాష్నికోవ్ (మిఖాయిల్ టిమోఫీవిచ్ కలాష్నికోవ్) మరణం. సోవియట్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్, ఆవిష్కర్త, సైనిక ఇంజనీర్, రచయిత, చిన్న ఆయుధాల డిజైనర్. ‘AK-47’ అసాల్ట్ రైఫిల్ కనుగొన్నాడు. AKM, AK-74, RPK లైట్ మెషిన్ గన్, PK మెషిన్ గన్‌లను అభివృద్ధి చేశాడు.

2016-02-08

Muqtida Hasan Nida Fazli Nida Fazli2016 : పద్మశ్రీ నిదా ఫజ్లీ (ముక్తిదా హసన్ నిదా ఫజ్లీ) మరణం. భారతీయ హిందీ మరియు ఉర్దూ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

1967-10-12

Ram Manohar Lohia1967 : రామ్ మనోహర్ లోహియా మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంపాదకుడు, రాజకీయవేత్త. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన చివరి దశలో 1942 వరకు బొంబాయిలోని వివిధ ప్రాంతాల నుండి రహస్యంగా ప్రసారం చేయబడిన కాంగ్రెస్ రేడియోలో పనిచేశాడు.

1963-10-09

Saifuddin Azizuddin Kitchlew1963 : సైఫుద్దీన్ కిచ్లేవ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త, శాంతి ఉద్యమ నాయకుడు. ‘జామియా మిలియా ఇస్లామియా’ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సభ్యుడు. లెనిన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఆయన అరెస్ట్ జలియన్ వాలాబాగ్ వద్ద హిందూ, సిక్కు, ముస్లిం నిరసనకారులతో కూడిన భారీ సమావేశాన్ని ప్రేరేపించింది మరియు ఊచకోతకు గురయ్యారు. భారతదేశ విభజనను వ్యతిరేకించాడు.

2017-07-16

Nar Bahadur Bhandari2017 : జగదాంబ శ్రీ నార్ బహదూర్ భండారీ మరణం. భారతీయ రాజకీయవేత్త. సిక్కిం 2వ ముఖ్యమంత్రి. ‘సిక్కిం సంగ్రామ్ పరిషత్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆధునిక సిక్కిం వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు.

Continue reading “2017-07-16”

1963-01-18

Laxminarayan Sahu lakshmi narayan laxmi1963 : పద్మశ్రీ లక్ష్మీనారాయణ సాహు మరణం. భారతీయ రచయిత, కవి, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, చరిత్రకారుడు, రాజకీయవేత్త. ఒడిశా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ‘ఇతిహాసరత్న’ బిరుదు పొందాడు. అంటరానితనం, మహిళలపై సాంఘిక దూరచరాలకు వ్యతిరేకంగా పోరాడాడు.