మరణం – పేజీ 97 – On This Day  

2020-10-14

2020 : పద్మశ్రీ శోభా నాయుడు మరణం. భారతీయ కూచిపూడి నృత్యకారిణి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. నృత్య చూడామణి, నృత్య కళా శిరోమణి బిరుదలు పొందింది. Continue reading “2020-10-14”

1914-10-12

1914 : మార్గరెట్ ఎలోయిస్ నైట్ మరణం. అమెరికన్ ఆవిష్కర్త, ఆటోమేటిక్‌గా ఫ్లాట్-బాటమ్డ్ పేపర్ బ్యాగ్‌లను కట్, ఫోల్డ్ మరియు జిగురు చేయగల యంత్రాన్ని కనుగొంది. ఆమెను “19 వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ మహిళా ఆవిష్కర్త” అని పిలుస్తారు. ప్రపంచంలోని ప్రధాన బయోగ్రాఫికల్ ప్రొఫైల్‌ల ప్రచురణకర్త మార్క్విస్ హూస్ హూ ఆమెకు  ఆల్బర్ట్ నెల్సన్ మార్క్విస్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు తో గౌరవించింది.

2007-10-11

2007 : చిన్మోయ్ కుమార్ ఘోస్ (శ్రీ చిన్మోయ్) మరణం. భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు, రచయిత, కళాకారుడు, కవి మరియు సంగీతకారుడు. విశ్వ సామ దూత, మహాత్మా గాంధీ యూనివర్సల్ హార్మొనీ అవార్డు, ఫ్రెడ్ లెబో అవార్డు, హిందూ ఆఫ్ ది ఇయర్ (1997) మరియు హిందూ పునరుజ్జీవన అవార్డు, మదర్ థెరిస్సా అవార్డు, శాంతి యాత్రికుడు, దేశాల మధ్య శాంతి మరియు స్నేహం కోసం మెడల్ ఆఫ్ హానర్, శాంతి అధ్యయనాలలో హ్యుమానిటీస్ గౌరవ డాక్టరేట్, 2012 క్లాస్ ఆఫ్ హనరీస్ అవార్డులతో సత్కరించబడ్డాడు.

1984-10-11

1984 : ఖండేరావ్ మోరేశ్వర్ రంగనేకర్ (ఖండూ) మరణం. భారతీయ టెస్ట్ క్రికెటర్. రంగనేకర్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్, అత్యుత్తమ భారత లెఫ్ట్ హ్యాండర్‌గా పరిగణించబడ్డాడు. అతను కవర్ పాయింట్ వద్ద మంచి ఫీల్డర్.

1979-10-08

jayaprakash narayan1979 : భారతరత్న జయప్రకాష్ నారాయణ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిద్ధాంతకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. లోక్ నాయక్ బిరుదు పొందాడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. ప్రజా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. Continue reading “1979-10-08”

2015-10-24

2015 : మాడా (మాడా వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు. ‘థర్డ్ జండర్’ ను ఉద్దేశించడానికి ‘మాడా’ అనే పదం వాడేలా తన ఇంటిపేరుతో అంతగా ప్రఖ్యాతి పొందాడు. Continue reading “2015-10-24”

2011-10-10

jagjit jagmohan Singh Dhiman2011 : పద్మ భూషణ్ జగ్జీత్ సింగ్ (జగ్‌మోహన్ సింగ్ ధీమాన్) మరణం. భారతీయ స్వరకర్త, గాయకుడు, సంగీతకారుడు. జగ్‌జిత్ సింగ్, ది గజల్ కింగ్, కింగ్ ఆఫ్ గజల్స్ బిరుదులు పొందాడు.

Continue reading “2011-10-10”

1964-10-10

guru dutt Vasanth Kumar Shivashankar Padukone1964 : గురుదత్ (వసంత్ కుమార్ శివశంకర్ పదుకొనే) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, నృత్య దర్శకుడు. ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు) గ్రహీత. Continue reading “1964-10-10”

2015-10-10

gopishantha manorama2015 : పద్మశ్రీ మనోరమ (గోపీశాంత క్లాకడయర్) మరణం. భారతీయ సినీ నటి, రంగస్థల నటి, నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. Continue reading “2015-10-10”

2013-10-09

Srihari Raghumudri2013 : రియల్ స్టార్ శ్రీహరి (రఘుముద్రి శ్రీహరి) మరణం. భరతీయ సినీ నటుడు, స్టంట్ మాస్టర్‌, పరోపకారి. ‘అక్షర ఫౌండేషన్‌’ వ్యవస్థాపకుడు. ‘మిస్టర్ హైదరాబాద్’ ఏడు సార్లు విజేత. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్.