సంఘటనలు – పేజీ 11 – On This Day  

1883-06-05

1883 : హార్లిక్ సోదరులు హార్లిక్స్ కోసం యుఎస్ పేటెంట్ (US patent no.278,967) పొందారు.

1936-11-12

1936 : భారతదేశంలోని కేరళలో భాగమైన ట్రావెన్‌కోర్ రాచరిక రాష్ట్రంలో మహారాజా చితిర తిరునాళ్ బలరామ వర్మ దళితులకు హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం కల్పిస్తూ ‘ఆలయ ప్రవేశ ప్రకటన’ను జారీ చేశాడు. ఈ ప్రకటన ట్రావెన్‌కోర్ మరియు కేరళ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

2019-11-12

2019 : డిస్నీ ఎంటర్టైన్మెంట్ యొక్క స్ట్రీమింగ్ సర్వీస్ ‘డిస్నీ ప్లస్’ ప్రారంభించబడింది.

1989-11-09

1989 : భారతదేశంలోని అయోధ్యలో రామజన్మభూమి ఆలయానికి శంకుస్థాపన జరిగింది.

1983-11-10

1983 : బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ యొక్క మొదటి ఆపరేటింగ్ సిస్టమ్ ‘విండోస్ 1.0’ ను ప్రకటించాడు. (కానీ 2 సంవత్సరాల తరవాత విడుదల చేశాడు.)

1885-11-10

1885 : ప్రపంచలోనే మొట్టమొదటి మోటార్ సైకిల్ ‘డైమ్లర్ రీట్‌వాగన్’ పరిచయం చేయబడింది. దీనిని జర్మన్ ఇంజనీర్ గాట్లీబ్ డైమ్లెర్ సృష్టించాడు.

1900-11-07

1900 : మహారాష్ట్రలోని సతారాలోని రాజ్‌వాడా చౌక్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ మొదటిసారిగా పాఠశాలలో ఇంగ్లీష్ మొదటి తరగతిలో ప్రవేశం పొందాడు.

2008-11-04

Barack Hussein Obama-II2008 : యునైటెడ్ స్టేట్స్ యొక్క 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికవడంతో ఈ పదవికి ఎన్నికైన మొదటి నల్లజాతియుడిగా చరిత్ర సృష్టించాడు.

1934-12-14

1934 : భారతదేశంలో ‘అఖిల భారతీయ గ్రామీణ ఉద్యోగ్ సంఘ్’ (ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్) ను మహాత్మా గాంధీ స్థాపించాడు.

1964-10-25

1964 : భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ట్యాంక్ అవడీ ఫ్యాక్టరీలో తయారు చేయబడింది, దీనికి ‘విజయంత్’ అని పేరు పెట్టారు.