2011 : పశ్చిమ బెంగాల్ 8వ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవి బాధ్యతలు స్వీకరించింది. దీంతో పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.
Event Type: సంఘటనలు
2023-05-19
2023 : రెండువేల రూపాయల కరెన్సీ నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. Continue reading “2023-05-19”
1995-05-19
1995 : ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన (17 సంవత్సరాల 294 రోజులు) వైద్యుడిగా అంబాటి బాలమురళి కృష్ణ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు.
2000-05-19
2000 : ఫిజీలో భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి మహేంద్ర పాల్ చౌదరితో సహ 36 మంది అధికారులను ఏడుగురు ముసుగు ధరించిన సాయుధులు తిరుగుబాటు చేసి కిడ్నాప్ చేశారు.
2000-05-27
2000 : ఫిజీ ప్రధానమంత్రి పదవి నుండి భారత సంతతికి చెందిన మహేంద్ర పాల్ చౌదరి పదవి విరమణ చేశాడు.
1999-05-19
1999 : ఫిజీ దేశ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన మహేంద్ర పాల్ చౌదరి నియమితుడయ్యాడు.
1912-05-18
1912 : మొదటి భారతీయ చలన చిత్రం ‘శ్రీ పుండలిక్’ విడుదలైంది. ఈ చిత్రం లండన్‌లో ప్రాసెస్ చేయబడినందున భారతీయ మొదటి చిత్రంగా పరిగణలోకి తీసుకోవడంలో వివాదాలు తలెత్తాయి.
1974-05-18
1974 : రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో మొదటి భూగర్భ అణు బాంబు పరీక్షతో భారతదేశం అణుశక్తి దేశంగా అవతరించింది. ఈ పరీక్షకు ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ అని పేరు పెట్టారు. Continue reading “1974-05-18”
1978-05-17
1978 : 11 వారాల క్రితం దొంగిలించబడిన చార్లీ చాప్లిన్ యొక్క శవపేటిక కనుగొనబడింది. Continue reading “1978-05-17”
1975-05-16
1975 : జపాన్ కు చెందిన పర్వతరోహిణి జుంకో తబీ మౌంట్ ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ప్రపంచంలోనే మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.