జననం – పేజీ 167 – On This Day  

1977-11-12

1977 : ప్రియాంక ఉపేంద్ర (ప్రియాంక త్రివేది) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు ఉపేంద్ర ను వివాహం చేసుకుంది. Continue reading “1977-11-12”

1768-11-11

1768 : సికిందర్ జా, అసఫ్ జా III, నవాబ్ మీర్ అక్బర్ అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్ జననం. హైదరాబాద్ రాజ్యాన్ని 1803 నుండి 1829 వరకు పరిపాలించిన మూడవ నిజాం. రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారుడు. ఈయన కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాద్ అని పేరుపెట్టారు.

1917-11-08

1917 : పద్మ భూషణ్ కమల్ జయసింగ్ రణదివే జననం. భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందింది. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘ స్థాపకురాలు.  భారతదేశంలో మొదటి టిష్యూ కాన్సర్ పరిశోధనా ప్రయోగశాలను బొంబాయిలో నెలకొల్పింది. ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పద్మభూషణ్ పొందింది. పలు గౌరవ పురస్కారాలు అందుకుంది. డిస్టింగ్విష్డ్ హ్యూమన్ అవార్డ్, టాటా మెమోరియల్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్ అండ్ మెమెంటోను పొందింది.

1918-11-11

Krishna Kumar Birla kk1918 : కె కె బిర్లా (కృష్ణ కుమార్ బిర్లా) జననం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘కెకె బిర్లా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1918-11-11”

1963-11-11

1963 : పొన్నంబలం జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్టంట్ మాన్. Continue reading “1963-11-11”

1888-11-11

1888 : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ (సయ్యద్ గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్ హుస్సేనీ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఇస్లామిక్ వేదాంతవేత్త, రచయిత, రాజకీయవేత్త. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు.

1978-11-10

1978 : క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. జాతీయ చాలనచిత్ర అవార్డు గ్రహీత.

1958-11-10

1958 : ఆనందరాజ్ జననం. భారతీయ సినీ నటుడు, రాజకీయవేత్త. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు గ్రహీత.

1967-11-10

1967 : అశుతోష్ రాణా (అశుతోష్ రాంనారాయణ్ నీఖ్రా) జననం. భారతీయ నటుడు, నిర్మాత, రచయిత మరియు టెలివిజన్ వ్యక్తి. ఆయన మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాలలో పనిచేశాడు. భారతీయ టెలివిజన్ షోలలో కూడా పనిచేశాడు. స్క్రీన్, జీ సినీ, సైమ, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు.

1978-11-09

1978 : రాజా అబెల్ జననం. భారతీయ చలనచిత్ర నటుడు, రాజకీయవేత్త, పాస్టర్. రాజా సినిమా రంగానికి దూరమైన తరవాత  హైదరాబాద్‌లో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్‌లో అతిథి స్పీకర్ గా అనేక క్రైస్తవ సమావేశాలకు ఆహ్వానించబడ్డాడు.