జననం – పేజీ 168 – On This Day  

1987-11-09

1987 : ఆర్తి (హారతి) జననం. భారతీయ తమిళ చలనచిత్ర హాస్య నటి, టెలివిజన్ హోస్ట్. యాపిల్ ఆర్తి, కుందు ఆర్తి అని కూడా పిలుస్తారు. ఆనంద వికటన్ అవార్డు అందుకుంది.

1991-11-08

1991 : అక్ష పర్దసాని జననం. భారతీయ సినీనటి, మోడల్. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించింది. సినిమాలకు ముందు ఆమె వాణిజ్య ప్రకటనలలో పాల్గొంది. వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చింది.

1656-11-08

1656 : ఎడ్మండ్‌ హలీ జననం. ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు, భౌతిక శాస్త్రవేత్త. ఈయన హెల్లీ తోకచుక్క యొక్క కక్ష్యలు కనుగొనుటలో ప్రపంచ ప్రసిద్ధుడు. ఆయన పేరు ఎన్నో ప్రసిద్ధ ప్రదేశాలకు పెట్టబడింది.

1893-11-08

1893 : పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు జననం. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కర్నాటక సంగీత వయోలిన్ విద్వాంసులలో ఒకడు. ఆయన పాక్షికంగా అంధుడు. సంగీత కళానిధి అవార్డు, సంగీత నాటక అకాడమీ, రాజా లక్ష్మీ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ పురస్కారం లభించింది. భారతీయ తపాలా ఆయన శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు.

1908-11-08

rajarao raja rao1908 : పద్మ విభూషణ్ రాజారావు జననం. భారతీయ అమెరికన్ రచయిత, ప్రొఫెసర్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1908-11-08”

1969-11-08

1969 : రేవంత్ రెడ్డి (అనుముల రేవంత్ రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త. తెలంగాణ 2వ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.

1927-11-08

1927 : భారతరత్న ఎల్ కె అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ) జననం. పాకిస్తానీ భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 7వ ఉప ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకులలో ఒకడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (RSS)లో దీర్ఘకాల సభ్యుడు.

1976-11-08

1976 : బ్రెట్ లీ జననం. ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, సినీ నటుడు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. Continue reading “1976-11-08”

1947-11-08

1947 : పద్మశ్రీ ఉషా ఉతుప్ జననం. భారతీయ పాప్, ఫిల్మీ, జాజ్, ప్లేబ్యాక్ సింగర్, నటి, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె ఇండియన్ ఐడల్ లో కనిపించి ఎంటర్టైన్ చేసింది. ఆమె ఐడియా స్టార్ సింగర్ సీజన్స్ లో న్యాయనిర్ణేతలలో ఒకరు. పద్మశ్రీ పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్, మిర్చి మ్యూజిక్, కళాకార్ అవార్డులను అందుకుంది.

1867-11-07

Maria Salomea Skłodowska merie curie mery kyuri1867 : మేరీ క్యూరీ (మేరీ సలోమియా స్క్లోడోవ్స్కా క్యూరీ) జననం. పోలిష్-ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ. రెండు నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తి. రెండు శాస్త్రాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి. కేన్సర్ చికిత్సకు మార్గదర్శకురాలు. రేడియం, పోలోనియం కొనుగొన్నది. Continue reading “1867-11-07”