1744 : అండర్స్ సెల్సియస్ మరణం. స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు. సెల్సియస్ ఉష్ణోగ్రత స్థాయి (సెంటీగ్రేడ్ స్కేల్) కనుగొన్నాడు. ‘ఉప్ప్సల ఖగోళ అబ్జర్వేటరీ’ స్థాపించాడు.
Event Type: మరణం
2015-04-08
2015 : పద్మ భూషణ్ డి జయకాంతన్ (జయకాంతన్ పిళ్లై) మరణం. భారతీయ సినీ దర్శకుడు, సినీ రచయిత, చిన్నకథా రచయిత, నవలా రచయిత. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న 2వ తమిళ రచయిత.
2020-02-17
2020 : లారీ టెస్లర్ (లారెన్స్ గోర్డాన్ టెస్లర్) మరణం. అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. కంప్యూటరులో కట్, కాపీ, పేస్ట్ కమాండ్లును సృష్టించాడు.
2011-04-24
2011 : పుట్టపర్తి సత్యసాయి బాబా (రత్నాకరం సత్యనారాయణ రాజు) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వేదాంతి, పరోపకారి. 14 సంవత్సరాల వయసులో షిరిడీ సాయిబాబా పునర్జన్మ అని చెప్పుకున్నాడు.
1968-04-25
1968 : పద్మ భూషణ్ బడే గులాం అలీ ఖాన్ మరణం. పాకిస్తానీ భారతీయ శాస్త్రీయ గాయకుడు, ఉస్తాద్. ‘సబ్రంగ్’ కలం పేరుతో ఎన్నో కొత్త స్వరకల్పనలు సృష్టించాడు. Continue reading “1968-04-25”
2008-11-05
2008 : పద్మ భూషణ్ బి ఆర్ చోప్రా (బల్దేవ్ రాజ్ చోప్రా) మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు, టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ‘బి ఆర్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. దూరదర్శన్ ధారావాహిక ‘మహాభారత్’ నిర్మించాడు. సినీ నిర్మాత యష్ రాజ్ చోప్రా సోదరుడు.
1992-07-17
1992 : పద్మశ్రీ కనన్ దేవి (కనన్ బాల) మరణం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, నిర్మాత. ‘శ్రీమతి పిక్చర్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి బెంగాలీ నటి.
2001-04-22
2001 : ఎం ఎ ఖాన్ (కున్వర్ మహమూద్ అలీ ఖాన్) మరణం. భారతీయ న్యాయవాది, రైతు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 14వ గవర్నర్.
1933-04-22
1933 : సర్ ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ మరణం. బ్రిటీష్ ఇంజనీర్, మార్గదర్శకుడు. కార్ల నిర్మాణ సంస్థ ‘రోల్స్ రాయిస్ లిమిటెడ్’ సహవ్యవస్థాపకుడు.
1974-08-07
1974 : అంజనీబాయి మల్పేకర్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయని. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొదటి మహిళ. రాజా రవివర్మ ఆమె రూపాన్ని ఊహిస్తూ చిత్రాలు వేసేవాడు. Continue reading “1974-08-07”