Yesterday – On This Day  

Yesterday

దినోత్సవం

బ్రెజిల్ స్వాతంత్ర్య దినోత్సవం (పోర్చుగల్ నుండి)

జాతీయ పోషక ఆహార వారోత్సవం (ఇండియా)

ప్రపంచ డుచెన్ అవగాహన దినోత్సవం

ఫిజి రాజ్యాంగ దినోత్సవం

నీలి ఆకాశంలో స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం

సంఘటనలు

1906 : బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది.

1948 : అశోక్ లేలాండ్ స్థాపించబడినది.

జననం

1887 : పద్మ విభూషణ్ గోపీనాథ్ కవిరాజ్ జననం. బంగ్లా భారతీయ సంస్కృత పండితుడు, ఇండాలజిస్ట్, తత్వవేత్త. తంత్రం, తత్వశాస్త్రం, మతం, సంస్కృతిపై అరుదైన అంతర్దృష్టికలవాడు.

Banoo Jehangir Coyaji1917 : పద్మ భూషణ్ బానూ జహంగీర్ కోయాజీ (బానూ పెస్టోంజీ కపాడియా) జననం. భారతీయ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. కుటుంబ నియంత్రణ మరియు జనాభా నియంత్రణ కార్యకర్త. పూణేలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్‌.

1925 : పద్మ భూషణ్ భానుమతి (పాలువాయి భానుమతి రామకృష్ణ) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, గాయని, నిర్మాత, నవలా రచయిత్రి, గీత రచయిత. లేడి సూపర్ స్టార్‌ బిరుదు పొందింది.

1951 : పద్మశ్రీ మమ్ముట్టి (ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, సామాజిక కార్యకర్త, పరోపకారి. మెగాస్టార్ బిరుదు పొందాడు.

1963 : హైజాకింగ్ హీరోయిన్ నీర్జా భానోట్ జననం. భారతీయ ఫ్లైట్ అటెండెంట్, మోడల్. అశోక చక్ర పొందిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలు.

1985 : రాధికా ఆప్టే జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

మరణం

1998 : కె ఎం చాందీ (కిజక్కైల్ మథాయ్ చాందీ) మరణం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 8వ గవర్నర్. గుజరాత్ 6వ గవర్నర్. పుదుచ్చేరి 7వ లెఫ్టినెంట్ గవర్నర్. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.

2013 : రొమేష్ భండారీ మరణం. పాకిస్తానీ భరతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్.

చరిత్ర కొనసాగుతుంది..