జననం – పేజీ 169 – On This Day  

1888-11-07

1888 : భారతరత్న సి వి రామన్ (చంద్రశేఖర వెంకట రామన్) జననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. ఈ గౌరవం పొందిన రెండవ భారతీయుడు. ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. స్త్రీలను చిన్న చూపు చూశాడు. Continue reading “1888-11-07”

1858-11-07

1858 : బిపిన్ చంద్ర పాల్ జననం. బంగ్లా భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, వక్త, సంఘ సంస్కర్త. ‘లాల్ బాల్ పాల్’ త్రయంలో మూడవ వాడు. భారతదేశ విప్లవాత్మక ఆలోచనల పితామహుడు. కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహాన్ని సమర్థించాడు. Continue reading “1858-11-07”

1971-11-07

1971 : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ) జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, గాయకుడు, నిర్మాత. బి ఎన్ రెడ్డి జాతీయ అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. Continue reading “1971-11-07”

1981-11-07

1981 : కళైమామణి అనుష్క శెట్టి (స్వీటీ శెట్టి) జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1981-11-07”

1979-11-07

1979 : రైమా సేన్ (రైమా దేవ్ వర్మ) జననం. భారతీయ నటి. బెంగాలీ, హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేస్తుంది. నటి రియా సేన్ సోదరి. నటి సుచిత్ర సేన్ మనమరాలు. బి.ఎఫ్.జె.ఎ. అవార్డు అందుకుంది.

1969-11-07

1969 : నందితా దాస్ జననం. భారతీయ నటి, దర్శకురాలు. ఆమె పది విభిన్న భాషల్లో 40కి పైగా చలన చిత్రాల్లో నటించింది. ఫైర్, ఎర్త్, బావందర్, కన్నతిల్ ముత్తమిట్టల్, అళగి, కమ్లి, బిఫోర్ ది రైన్స్ లకు ప్రశంసలు అందుకుంది. భారతీయ మానవతా వికాస్ పురస్కారాన్ని పొందింది. ఫిల్మ్ ఫేర్, నంది, కేరళ ఫిల్మ్, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ లాంటి ఎన్నో అవార్డులను అందుకుంది.

1954-11-07

1954 : పద్మ భూషణ్ కమల్ హాసన్ (పార్థసారథి శ్రీనివాసన్) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, నేపథ్య గాయకుడు, పాటల రచయిత, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. యునివర్సల్ హీరో బిరుదు పొందాడు. ‘మక్కల్ నీది మైయం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1954-11-07”

1959-11-06

1959 : పునీత్ ఇస్సార్ జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మాండలిక కోచ్. దూరదర్శన్ ధారావాహిక ‘మహాభారత్’ లో దుర్యోధనుడి పాత్ర పోషించినందుకు దేశవ్యాప్త గుర్తింపు పొందాడు. Continue reading “1959-11-06”

1861-11-06

1861 : జేమ్స్ నైస్మిత్ జననం. కెనడియన్-అమెరికన్ ఫిజికల్ ఎడ్యుకేటర్, ఫిజిషియన్, క్రిస్టియన్ చాప్లిన్, స్పోర్ట్స్ కోచ్, బాస్కెట్‌బాల్ గేమ్ ఆవిష్కర్త. ఆయన బాస్కెట్‌బాల్ నియమ పుస్తకాన్ని వ్రాసాడు,  యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ బాస్కెట్‌బాల్ ప్రోగ్రామ్‌ను స్థాపించాడు. ఫిబా హాల్ ఆఫ్ ఫేమ్, కెనడియన్ ఒలింపిక్ హాల్ ఆఫ్ ఫేమ్, లాంటి అవార్డులు లభించాయి.

1988-11-05

1988 : పద్మశ్రీ విరాట్ కోహ్లీ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. సినీ నటి అనుష్క శర్మ ను వివాహం చేసుకున్నాడు. Continue reading “1988-11-05”